News September 11, 2025
రేపటి నుంచే పరీక్షలు.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

పార్ట్ టైం PhD ప్రవేశ పరీక్షలు JNTUHలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు (14వ తేదీ వరకు) ఈ పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారంగా ఈ టెస్టులు నిర్వహించనున్నారు. దాదాపు 995 మంది ఎంట్రన్స్ టెస్టుకు హాజరవుతారని అధికారులు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అడ్మిషన్స్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు.
Similar News
News March 3, 2026
హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంటోంది!

హోలీ పండుగ, గ్రహణం ఉండటంతో నగరంలో రోడ్లు, బస్సులు వెలవెలబోయాయి. సాధారణంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఖాళీగా కనిపించాయి. ప్రజలు ఇళ్ల వద్దే కుటుంబాలతో పండుగ జరుపుకోవడంతో బయట రాకపోకలు తగ్గాయి. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు బస్సుల్లో ప్రయాణికులు లేక సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రంగుల సందడి కాలనీలకే పరిమితమైంది. బండ్ల పొగ లేక నగరం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది.
News March 3, 2026
‘బ్లాక్‌చైన్ బస్తీ’గా పాతబస్తీ?

చార్మినార్ పరిసరాల్లోని యువత ఇప్పుడు బిర్యానీ కబుర్ల కంటే ‘బ్లాక్‌చైన్’ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న ఇంటర్నెట్ సెంటర్లలో డిజిటల్ లెడ్జర్స్, క్రిప్టో కోడింగ్‌పై వర్క్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. విదేశీ ప్రాజెక్టుల కోసం ఇక్కడి కుర్రాళ్లు ఫ్రీలాన్సింగ్ చేస్తూ భారీగా సంపాదిస్తూ పాతబస్తీ యువత డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇది భవిష్యత్తులో HYDకు కొత్త గుర్తింపు తీసుకురావడం ఖాయం.
News March 3, 2026
GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.


