News September 11, 2025
GWL: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలి

అంగన్వాడీ టీచర్లు విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో గట్టు మండలం అభివృద్ధి కార్యక్రమాలపై ఎల్టీఐ మైండ్ ట్రీ సంస్థ సహకారంతో నడుస్తున్న శిక్షణ ఫౌండేషన్, భవిష్య భారత్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గట్టు మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు 49 ట్యాబ్స్ పంపిణీ చేశారు.
Similar News
News March 17, 2026
MNCL: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. లయన్స్ క్లబ్, క్రెడాయి సభ్యుడైన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు హైదరాబాద్‌లో చదువుకుంటున్న కూతురు రిషిత వద్దకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టగా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. జంట మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.
News March 17, 2026
WGL: స్తంభించిన రియల్ ఎస్టేట్..!

ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ కొంతకాలంగా మందగమనంలో సాగుతోంది. రెండేళ్లుగా క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గిపోవడంతో అటు వ్యాపారులు, ఇటు రిజిస్ట్రేషన్ శాఖ ఆందోళన చెందుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే, 2024లో 1,05,834 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 2025లో 1,03,784, 2026లో ఇప్పటివరకు 19,146 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. గతంలో రోజుకు సగటున 170 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ప్రస్తుతం 40 కూడా దాటడం లేదు.
News March 17, 2026
పల్నాడు: యువతి కిడ్నాప్ కలకలం.. పోలీసుల ఛేజింగ్‌తో సురక్షితం!

రొంపిచర్ల మండలం తుంగపాడులో యువతి కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువతిని బైకులపై వెంబడించిన దుండగులు అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టారు. అన్నారం వద్ద నిందితుల వాహనాలను స్వాధీనం చేసుకోగా.. పోలీసుల సాయంతో యువతి సురక్షితంగా స్టేషన్‌కు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


