News September 11, 2025

నేపాల్ ప్రజలకు అధ్యక్షుడు బహిరంగ ప్రకటన

image

ఉద్రిక్త పరిస్థితుల నడుమ నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ బహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని లేఖ విడుదల చేశారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్నానని పేర్కొన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సంయమనం పాటించాలని దేశ ప్రజలను కోరారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Similar News

News September 12, 2025

బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో టీటీడీ ఈవో భేటీ

image

AP: బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని, మెట్ల మార్గాల్లో భద్రత మరింత పటిష్ఠం చేయాలని దిశానిర్దేశం చేశారు.

News September 11, 2025

నక్సలైట్లందరూ సరెండర్ అవ్వాలి: అమిత్ షా

image

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మరణించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘CRPF కోబ్రా కమాండర్స్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, DRG జాయింట్ ఆపరేషన్ చేపట్టి 10 మంది నొటోరియస్ నక్సలైట్లను హతమార్చారు. రూ.కోటి బౌంటీ ఉన్న CCM మోడెమ్ బాలకృష్ణ అలియాస్ మనోజ్‌ను కూడా మట్టుబెట్టారు. మిగిలిన నక్సలైట్లందరూ గడువులోగా లొంగిపోవాలి. మార్చి 31లోపు రెడ్ టెర్రర్‌ను ఏరివేయడం ఖాయం’ అని ట్వీట్ చేశారు.

News September 11, 2025

టీడీపీ స్ర్కిప్ట్‌నే బీజేపీ ఫాలో అవుతోంది: పేర్ని నాని

image

AP: హిందూ మతం ముసుగులో YCPపై బీజేపీ నేతలు మాధవ్, పురందీశ్వరి విషం చిమ్ముతున్నారని పేర్ని నాని ఫైరయ్యారు. టీడీపీ స్క్రిప్ట్‌ను BJP నేతలు కాపీ పేస్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. దీని బదులు పవన్‌లాగా పార్టీని చంద్రబాబుకు అద్దెకు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అంతర్వేది రథం ధ్వంసంపై తాము ఆనాడే సీబీఐ విచారణ కోరినట్లు తెలిపారు. TDP, బీజేపీ కలిసి ఉన్నప్పుడే APలో అత్యధికంగా ఆలయాలు ధ్వంసమయ్యాయన్నారు.