News September 11, 2025

HYD: APలో తీగ లాగితే TGలో డొంక కదలింది

image

గొర్రెల స్కాంలో ఈడీ వేగం పెంచింది. బాధితులు ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. గొర్రెల స్కామ్‌లో మోసపోయామని ఏపీ గొర్రెలకాపరులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ ఎంటర్ అయ్యింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు బ్రోకర్లు రూ.2కోట్లు ఎగవేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ తీగలాగితే TGలో డొంక కదిలింది.

Similar News

News March 11, 2026

నెక్లెస్ రోడ్‌ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

image

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

News March 11, 2026

యుద్ధం సెగలు.. HYDలో పెరిగిన ధరలు

image

మిడిలీస్ట్ యుద్ధం మంటలతో IT కారిడార్ హాస్టళ్లలో ఉండేవారికి, నిరుద్యోగుల కడుపు కాలుతోంది. యుద్ధ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా తగ్గడంతో చిన్న హోటళ్లలో ప్లేట్ టిఫిన్‌పై ₹5 వరకు పెంచేశారని ప్రజలు చెబుతన్నారు. దీనికి తోడు మధ్యాహ్నానికే గ్యాస్ అయిపోవడం, షట్టర్ కట్టేస్తుండటంతో 2 పూటలు కడుపు కాలుతోందంటున్నారు. హాస్టళ్లలో బేసిక్ మీల్స్ ఇవ్వాలని హాస్టళ్ల <<19350638>>అసోసియేషన్<<>> నిర్ణయించింది. దీనిపై మీ కామెంట్

News March 11, 2026

హైదరాబాద్‌లో హై టెన్షన్ తీర్పు

image

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్‌ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.