News September 11, 2025
సీఎం ఆలోచనలతో నీటినిల్వలు పెరిగాయి: నిమ్మల

AP: సీఎం చంద్రబాబు ఆలోచనలు సత్ఫలితాలిచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. ‘గతేడాదితో పోల్చితే వర్షపాతం తక్కువైనా భూగర్భజలాలు, రిజర్వాయర్లలో నీటినిల్వలు ఉన్నాయంటే CM వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది. తుంగభద్ర, శ్రీశైలం, కాటన్ బ్యారేజ్, గోరకల్లు రిజర్వాయర్, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే చేశారు. కరవు లేకుండా చేయడమే CM లక్ష్యం’ అని స్పష్టం చేశారు.
Similar News
News September 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 12, 2025
శుభ సమయం (12-09-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ పంచమి మ.1.45 వరకు
✒ నక్షత్రం: భరణి సా.4.31 వరకు
✒ శుభ సమయములు: లేవు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: మ.3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: తె.3.43-ఉ.5.13
✒ అమృత ఘడియలు: మ.12.03-మ.1.32
News September 12, 2025
ఆసియా కప్: హాంకాంగ్‌పై బంగ్లాదేశ్ విజయం

ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో మ్యాచులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 143/7 స్కోర్ చేయగా, అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. కెప్టెన్ లిటన్ దాస్ 59, హృదోయ్ 35 రన్స్‌తో రాణించారు. రేపు గ్రూప్-Aలో ఉన్న పాక్, ఒమన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.