News September 11, 2025

సోనియా గాంధీకి కోర్టులో ఊరట

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. భారత సిటిజన్ అవ్వకముందే ఆమె ఓటు హక్కు పొందారని, విచారణ జరపాలని న్యాయవాది వికాస్ త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు. ‘1980లో సోనియా ఓటు హక్కు పొందారు. ఆ తర్వాత 1982లో ఎన్నికల సంఘం దాన్ని తొలగించింది. అంటే ఆమె అక్రమంగా ఓటర్ ఐడీ పొందారని స్పష్టమవుతోంది’ అని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.

Similar News

News March 17, 2026

ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్

image

ఇండియాలో గొంతు క్యాన్సర్‌కు పొగ తాగడం, పొగాకు నమలడం ప్రధాన కారణాలు. ఇప్పుడు US, UKలో ఓరల్ సెక్స్‌ ద్వారా అధిక సంఖ్యలో HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో HPV-16, HPV-18 రకాలు గొంతు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయంటున్నారు. ఎక్కువ మందితో లైంగిక సంబంధం, HPV వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

News March 17, 2026

ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్లు విడుదల

image

AP: రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం రూ.45 కోట్లను విడుదల చేసింది. 5వేల మంది ఇమామ్‌లకు రూ.30 కోట్లు, 5 వేల మంది మౌజన్ల అకౌంట్లలో రూ.15 కోట్లు జమ చేసింది. నిన్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డబ్బులు రిలీజ్ చేసింది.

News March 17, 2026

క్లైమాక్స్‌ను సరికొత్తగా ప్లాన్ చేసిన హరీశ్ శంకర్!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘‘సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో విలన్‌ని ఓడించి అంతం చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఆ రెగ్యులర్ క్లైమాక్స్‌ను బ్రేక్ చేసి సరికొత్తగా ప్లాన్ చేశాం. సినిమా చివరి వరకు ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు’’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.