News September 11, 2025

సిరిసిల్ల: ‘ప్రతి గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా చేయాలి’

image

ప్రతి గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా చేయాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు, మండల ప్రజా పరిషత్ అధికారులతో గురువారం ఆమె సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు టీబీపై అపోహలు తొలగిస్తూ వ్యాధి సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలన్నారు.

Similar News

News September 12, 2025

సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 12, 2025

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

image

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, <>వెబ్‌సైట్‌లో<<>> పెట్టాలని కాలేజీలను ఆదేశించింది. లోకల్ విద్యార్థులకు ఈ నెల 15, 16 తేదీల్లో, నాన్ లోకల్ వారికి 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. ఈ నెల 20న ప్రవేశాల వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.

News September 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 12, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
✒ ఇష: రాత్రి 7.33 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.