News September 11, 2025
కరీంనగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సూసైడ్ చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మోతె వాసి బత్తిని తిరుపతి(42) కొద్ది నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇటీవల అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలని బాధపడుతూ గురువారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య మనోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 4, 2026
భద్రాద్రి: హెల్త్ మిషన్.. సేవలు ఇవే

భద్రాద్రి జిల్లాలో హెల్త్ మిషన్ 100 డేస్ కార్యక్రమం మార్చి 4 నుంచి జూన్ 9 వరకు 4 దశల్లో కొనసాగనుంది. విద్యార్థులకు స్క్రీనింగ్, కౌన్సెలింగ్, వ్యాధుల స్క్రీనింగ్, ప్రజారోగ్య సిద్ధత చర్యలు, హీట్ స్ట్రోక్ రూమ్‌ల ప్రారంభం, చికిత్స, రిఫరల్, ఫాలోఅప్, క్యాన్సర్ రిజిస్ట్రీ ఉంటాయని DMHO డాక్టర్ తుకారం రాథోడ్ తెలిపారు. DCCC ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స, రిఫరల్ ఫాలోఅప్ ఉంటాయన్నారు.
News March 4, 2026
వేములవాడ: నేడే అసలైన హోలీ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో హోలీ వేడుకలను బుధవారం జరుపుకోనున్నారు. ఫాల్గుణ పౌర్ణిమ రోజున హోలీ వేడుకలు జరుపుకోవాల్సి ఉండగా, కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా 4వ తేదీ (బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు సూచించారు. ఈ మేరకు బుధవారం వేములవాడతో పాటు అనేక ప్రాంతాల్లో హోలీ జరుపుకోనున్నారు. ప్రభుత్వ సెలవు కారణంగా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం హోలీ జరుపుకున్నారు.
News March 4, 2026
ఉమ్మడి నల్గొండలో పెరుగుతోన్న ఈ- సిగరెట్ వేప్ వాడకం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో యువతలో ఈ సిగరెట్ వేప్ వినియోగం పెరుగుతోన్నట్లు నార్కోటిక్ విభాగం వెల్లడించింది. వాట్సాప్ గ్రూపుల ద్వారా బుక్ చేసి కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. నికోటిన్‌తో కూడిన ఈ వేప్‌తో క్యాన్సర్, గుండె జబ్బులు, ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదముందని, ఒక్కసారి వాడితే బానిసలుగా మారే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. విక్రయాపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


