News September 11, 2025

సింగరేణి కార్మికుల సమస్యలపై INTUC సమావేశం

image

HYDలోని INTUC కార్యాలయంలో సింగరేణి కార్మికుల సమస్యలపై యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్(RGM) ఆధ్వర్యంలో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులపై యాజమాన్యం అవలంబిస్తోన్న మొండి వైఖరిని ఎదుర్కునే విధానాలపై చర్చించారు. కార్మికులకు లాభాల వాటా, కాంట్రాక్టు కార్మికుల బోనస్, IT మాఫీ అంశాలను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 8, 2026

WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

image

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్‌ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.

News March 8, 2026

NZB: 246 కేసులు.. రూ 20.30 లక్షల జరిమానా: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసుల్లో పట్టుబడిన వారిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.20.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News March 8, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 8)

image

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం