News September 11, 2025

గోదావరిఖని: ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి: CPI

image

తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని రామగుండం నగర CPI కార్యదర్శి కే.కనకరాజు పేర్కొన్నారు. గోదావరిఖని పట్టణ చౌరస్తాలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

Similar News

News March 14, 2026

ఇండక్షన్ స్టవ్‌లు వాడేవారికి తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్

image

గ్యాస్ సంక్షోభం వేళ విద్యుత్ స్టవ్‌లు వినియోగించే వ్యాపారులకు TN ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెస్టారెంట్లు, హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, టీ స్టాల్స్‌లో కరెంట్ యూనిట్‌పై రూ.2 సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రం విధించిన షరతులు అమల్లో ఉన్నన్ని రోజులు ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల పంపిణీ ప్రారంభమైనట్లు తాజాగా కేంద్రం పేర్కొంది.

News March 14, 2026

పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు: ఎస్పీ

image

పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద, ప్రశ్నపత్రాలు తీసుకుని వెళ్లే సమయంలో బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News March 14, 2026

భవిష్యత్తులో $1 ట్రిలియన్ కంపెనీకి ఐదుగురు ఉద్యోగులే: సలీమ్

image

కంపెనీల పనితీరు, నిర్మాణాన్ని AI సమూలంగా మార్చేస్తోందని OpenExO ఫౌండర్ సలీమ్ ఇస్మాయిల్ తెలిపారు. ‘వందేళ్ల కిందట $1Bn కంపెనీ నిర్మాణానికి 1L మంది ఉద్యోగుల అవసరం ఉండేది. క్రమంగా ఆ సంఖ్య 10Kకు పడిపోయింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు వందల మందితోనే ఆ ఘనతను సాధించాయి. తర్వాతి $1 ట్రిలియన్ కంపెనీ ఐదుగురికే ఉపాధి కల్పిస్తుంది. ఈ మార్పుకు AI, ఇతర టెక్నాలజీలు కారణం’ అని ఓ కాంక్లేవ్‌లో పేర్కొన్నారు.