News April 4, 2024

త్వరలో ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు భారతీయ ఈవీ కార్ల తయారీ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. టెస్లా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇండియాలో అనువైన ప్రాంతాన్ని గుర్తించే పనిలో పడింది. ఈక్రమంలో ఈనెలలోనే అమెరికా నుంచి టెస్లా బృందం ఇండియాకు రానుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఏర్పాటైన ఆటోమోటివ్ హబ్‌లతో ఈ బృందం ప్లాంట్ కోసం స్థలాన్ని గుర్తించనుంది.

Similar News

News March 21, 2026

భారత్ – ఐర్లాండ్ మధ్య 2 టీ20లు

image

భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. జూన్ 26, 28వ తేదీల్లో 2 మ్యాచులు ఆడనున్నట్లు పేర్కొంది. 2 టీ20లూ బెల్‌ఫాస్ట్(ఐర్లాండ్) వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 2007 తర్వాత ఈ వేదికలో భారత్ మళ్లీ ఇప్పుడే ఆడనుంది. ఆ వెంటనే జులై 1 నుంచి 11వ తేదీ వరకు భారత్-ఇంగ్లండ్ మధ్య 5టీ20లు జరగనున్నాయి.

News March 21, 2026

పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

image

హైదరాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్‌కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్‌పేట్‌లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్‌పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

News March 21, 2026

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ అదుపులో అభిషేక్ సింగ్

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ అభిషేక్ సింగ్‌ను సిట్ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. అతని సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచారణ జరుగుతోంది. అభిషేక్ నుంచి BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రోహిత్ రెడ్డికి అతను 24 సార్లు మత్తుపదార్థాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.