News September 11, 2025

గోదావరిఖని: టీబీజీకేఎస్‌ ఫిట్‌ సెక్రటరీగా కొయ్యడ మల్లేశ్

image

సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో కోల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న కొయ్యడ మల్లేశ్‌ టీబీజీకేఎస్‌ ఫిట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. టీబీజీకేఎస్‌ ఆర్జీ-1 వైస్‌ ప్రెసిడెంట్‌ వడ్డెపల్లి శంకర్‌ కొయ్యడ మల్లేశ్‌ను నియమిస్తూ గురువారం నియామకపు ఉత్తర్వులు అందజేశారు. తనను నియమించినందుకు కొయ్యడ మల్లేశ్ కృతజ్ఞతలు తెలిపారు. టీబీజీకేఎస్‌ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

Similar News

News September 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 12, 2025

సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం (ఫొటోలో లెఫ్ట్)
1967: నటి అమల అక్కినేని జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (ఫొటోలో రైట్)
2009: BCCI మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం
2024: తెలుగు గీత రచయిత గురుచరణ్ మరణం

News September 12, 2025

సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.