News September 11, 2025

NRPT: హ్యాండ్లూమ్ భవన్ నిర్మాణ పనుల పరిశీలించిన అధికారులు

image

దసరాలోపు హ్యాండ్లూమ్ ఎక్సలెన్స్ భవనం పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట పట్టణ శివారులో నిర్మిస్తున్న సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ భవన నిర్మాణ పనులను గురువారం సందర్శించి రివ్యూ చేశారు. బ్యాలెన్స్ పనులు తొందరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీజీ ఎంఎస్ ఐడీసీ ఈఈ రతన్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 20, 2026

PHOTO GALLERY: గద్దర్ అవార్డుల వేడుక

image

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ, నారాయణ మూర్తి, రామ్ చరణ్, సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అవార్డుల విజేతలు హాజరయ్యారు. పైన గ్యాలరీలో కొన్ని ఫొటోలను చూడొచ్చు.

News March 20, 2026

మార్చి 20: చరిత్రలో ఈ రోజు

image

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం

News March 20, 2026

తండ్రి అయిన RCB కెప్టెన్

image

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గుంజన్ పండంటి మగ బిడ్డకు నిన్న జన్మనిచ్చారు. దీంతో IPL ప్రారంభానికి వారం రోజుల ముందే వారి ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండర్‌కు చెందిన పాటీదార్ 2022లో గుంజన్‌ను వివాహమాడారు. మరోవైపు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా <<19424001>>ఉగాది రోజునే<<>> మరోసారి తండ్రయ్యారు. దినేశ్, పాటీదార్ ఒకేరోజు పుట్టడం(జూన్ 1) విశేషం.