News September 11, 2025
జిల్లా స్థాయి TLM మేళా వాయిదా: DEO

రేపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా స్థాయి TLM మేళాను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక కారణంగా TLM మేళాను వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మళ్లీ TLM మేళా నిర్వహించే తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామని అన్నారు.
Similar News
News March 14, 2026
ఖమేనీ అందుకే బంకర్‌లోకి వెళ్లలేదు: ఇరాన్ ప్రతినిధి

దేశ ప్రజలను ఆపదలో వదిలేసి తాను సేఫ్ బంకర్‌లోకి వెళ్లడానికి ఖమేనీ ఇష్టపడలేదని భారత్‌లో సుప్రీం లీడర్ ప్రతినిధి హకీమ్ India Today కాంక్లేవ్‌లో తెలిపారు. ఇరాన్‌లోని 9Cr మందికి సేఫ్ షెల్టర్ ఏర్పాటు చేసినప్పుడే తానూ బంకర్ హౌస్‌లోకి మారతానన్నారని చెప్పారు. నివాసాన్ని బంకర్ బేస్‌మెంట్‌తో పటిష్ఠంగా మార్చడానికీ అంగీకరించలేదన్నారు. కాగా US-ఇజ్రాయెల్ మిస్సైల్ దాడిలో ఖమేనీ సహా పలువురు కుటుంబీకులు మరణించారు.
News March 14, 2026
బనగానపల్లెలో యువకుడి సూసైడ్

బనగానపల్లెలో తెలుగు పేటకు చెందిన హేమంత్ కుమార్(20) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై కల్పన తెలిపిన వివరాల మేరకు.. హేమంత్ కుమార్ ఇటీవల బైక్ కొనుగోలు చేశాడు. కంతులు చెల్లించలేదన్న కారణంతో ఫైనాన్షియర్లు బైకును తీసుకువెళ్లారు. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News March 14, 2026
రాజమండ్రి: లోక్ అదాలత్‌లో 18,441 కేసుల పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 18,441 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత తెలిపారు. 17,672 క్రిమినల్, 630 సివిల్, 139 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 18,302 కేసులకు మోక్షం లభించడంతో కక్షిదారులకు ఊరట లభించింది. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా సమయం ఆదా అవుతుందని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.


