News September 11, 2025
నెల్లూరు కొత్త కలెక్టర్ ఈయనే.!

నెల్లూరు కలెక్టర్‌గా నియమితులైన హిమాన్షు శుక్లా ఇది వరకు AP I&PR (సమాచార&ప్రజా సంబంధాల శాఖ) డైరెక్టర్‌గా పని చేశారు. ఈయన 2013 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి. హిమాన్షు పలు జిల్లాల్లో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
Similar News
News March 13, 2026
యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
News March 13, 2026
నెల్లూరు: రైల్వే ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్

BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్-D పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి పి.వెంకట లక్ష్మి తెలిపారు. BC, SC, ST అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోగా అప్లికేషన్లను నెల్లూరు RTC బస్టాండ్ సమీపంలోని తమ ఆఫీసులో ఇవ్వాలని సూచించారు. మెరిట్ ఆధారంగా 100మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఈనెల 25 నుంచి 2నెలలు శిక్షణ ఇస్తామన్నారు. స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు.
News March 13, 2026
హైవేల వెంట వేసైడ్ అమెనిటీస్‌కు పెట్టుబడిదారుల ఆసక్తి : కలెక్టర్

జిల్లాలో రోడ్డు, హైవే మార్గాల వెంట ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కల్పించే వేసైడ్ అమెనిటీస్ (Wayside Amenities) ఏర్పాటుకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన ఆసక్తి వ్యక్తమవుతోందని కలెక్టర్ హిమాన్షు శుక్ల సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రయాణికులకు సౌకర్యంగా ఫుడ్ కోర్టులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిక్ వాహనాలకు EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.


