News September 11, 2025

మహిళా యూనివర్సిటీ విద్యార్థినికి అరుదైన అవకాశం

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ B.Tech విద్యార్థినికి అరుదైన అవకాశం లభించింది. చివరి సంవత్సరం CSE చదువుతున్న చంద్రిక గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఎంపికైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. గూగుల్ టెక్నాలజీపై స్వల్పకాలిక అవగాహన, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ఆమెకు ఈ అవకాశం లభించింది. ఈ మేరకు ఆమెను VC ఉమ, రిజిస్ట్రార్ రజిని అభినందించారు.

Similar News

News March 18, 2026

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్

image

కలెక్టర్ డా.లక్ష్మీశ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో జిల్లా కన్సల్టేటివ్ (DCC), రివ్యూ కమిటీ (DLRC) సమావేశం నిర్వహించారు. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు సులభంగా రుణాలు అందించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో కీలక పనితీరు సూచికల(KPIs) సాధనలో బ్యాంకులు చురుకుగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్, ఆర్బీఐ, నాబార్డ్ తదితర అధికారులు హాజరయ్యారు.

News March 18, 2026

పల్నాడులో నెట్‌వర్క్ సమస్యలకు చెక్

image

పల్నాడు జిల్లాలో మొబైల్ నెట్‌వర్క్ సమస్య పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషితో 4జీ టవర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. డిజిటల్ భారత్ నిధి కింద BSNL ద్వారా 19 టవర్లు మంజూరు కాగా, 2026 డిసెంబర్ నాటికి సేవలు ప్రారంభం కానున్నాయి. అదనంగా Indus Towers సహకారంతో మరో 36 టవర్లు ప్రతిపాదించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సమస్యలు తగ్గనున్నాయని ఎంపీ తెలిపారు.

News March 18, 2026

UG, PG విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులు

image

TG: రాష్ట్రంలోని విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. UGలో 19, PGలో 10 కోర్సులు, AEDP(అప్రెంటిస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 2030 నాటికి వివిధ రంగాల్లో 20L ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని, వాటిని సాధించేలా యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.