News September 11, 2025

శ్రీ సత్యసాయి జిల్లా కొత్త కలెక్టర్ ఈయనే!

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ నియమితులయ్యారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం బదిలీ చేయడంతో త్వరలో సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ప్రస్తుత కలెక్టర్ టీఎస్ చేతన్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

Similar News

News March 11, 2026

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం సాయంత్రం జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి హై వోల్టేజ్ స్తంభం ఎక్కుతుండగా నేవీ సిబ్బంది గమనించి దిగిపోమని హెచ్చరించినప్పటికీ మరింత మీదకు వెళ్లడంతో వైర్లు తగిలి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.

News March 11, 2026

నల్గొండ: అప్పు విషయంలో గొడవ ప్రాణం తీసింది

image

అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News March 11, 2026

KUకి CPGET-2026 నిర్వహణ బాధ్యతలు

image

రాష్ట్రంలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక CPGET-2026 పరీక్షల నిర్వహణ బాధ్యతలు వరంగల్‌లోని కేయూకు దక్కాయి. గత కొన్నేళ్లుగా ఈ పరీక్షలను హైదరాబాద్ OU నిర్వహిస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేసి బాధ్యతలను కేయూకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు.