News September 11, 2025

HNK: బీసీ బ‌హిరంగ స‌భ‌ను స‌క్సెస్ చేయాలి: మంత్రి

image

కామారెడ్డిలో నిర్వహించబోయే బీసీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కామారెడ్డిలో బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించామ‌ని, అనంత‌రం బీసీల‌కు న్యాయం చేసేందుకు కృషి చేశామ‌ని, బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మంత్రి అన్నారు.

Similar News

News September 12, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ కోచ్ ఏమన్నారంటే?

image

ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న జరిగే IND, PAK మ్యాచులో రిస్ట్ స్పిన్నర్ల మధ్యే పోటీ ఉంటుందన్న అభిప్రాయాలపై PAK కోచ్ మైక్ హెసన్ స్పందించారు. ‘దుబాయ్ పిచ్ స్పిన్‌కు అంతగా సహకరిస్తుందని అనిపించడం లేదు. UAEతో మ్యాచులో కుల్దీప్ యాదవ్ బాల్‌ను ఎక్కువగా స్పిన్ చేయలేదు. రిస్ట్ స్పిన్నర్లుంటే సర్ఫేస్‌తో పనిలేదు. మా జట్టులోనూ ఐదుగురు స్పిన్నర్లున్నారు. నవాజ్ వరల్డ్‌లోనే బెస్ట్ స్పిన్నర్’ అని పేర్కొన్నారు.

News September 12, 2025

సంగారెడ్డి: ఉన్నత చదువులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివేందుకు అనుమతినిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో 19 మంది ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివేందుకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

News September 12, 2025

HNK: కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వండి: కలెక్టర్

image

ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణంలో జాప్యం చేసే కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణ పనులు, వైద్య సిబ్బంది సమయపాలన, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.