News September 11, 2025

సిరిసిల్ల: టీబీ రహిత గ్రామాల కోసం అవగాహన కార్యక్రమం

image

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఈరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా వైద్యాధికారి డా.ఎస్.రజిత టీబీ రహిత గ్రామాల కోసం ఆరు సూచీలపై స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీస్, ఎంఎంపీఓలకు మార్గదర్శకాలు ఇచ్చారు. టీబీ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స, ప్రభుత్వ సదుపాయాలపై వివరించారు.

Similar News

News March 15, 2026

KMR: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని, అందిన అర్జీలను అధికారులు తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తారని ఆయన ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదికను వాడుకోవాలని సూచించారు.

News March 15, 2026

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) అంటే ఏంటి?

image

ఇది పైప్‌లైన్ ద్వారా నేరుగా ఇంటి వంటగదికి చేరుతుంది. మీటర్ ద్వారా వినియోగాన్ని బట్టి బిల్లు వస్తుంది. యూనిట్ ధర దాదాపు రూ.40-60 (క్యూబిక్ మీటర్) వరకు ఉంటుంది. గ్యాస్ అయిపోతుందన్న చింత ఉండదు. సాధారణంగా నెలకు రూ.400-800 బిల్లు వస్తుంది. కనెక్షన్ పొందడానికి రూ.7 వేల వరకు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. HYDలోనూ BGL సంస్థ PNG సౌకర్యం కల్పిస్తోంది. అయితే అన్ని ప్రాంతాల్లో PNG లేకపోవడం పెద్ద సమస్య.

News March 15, 2026

TVKకు 80 సీట్లు, Dy.CM పదవి.. బీజేపీ ఆఫర్?

image

TN అసెంబ్లీ ఎన్నికల్లో BJPతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ పలుమార్లు <<19381860>>చెప్పినా<<>> ఊహాగానాలు ఆగడం లేదు. తాజాగా TVKకు 80 సీట్లు, Dy.CM పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. చర్చలు తుదిదశకు చేరుకున్నాయని తెలిపాయి. CM పోస్టుపై విజయ్ దృష్టిపెట్టారని, దీనిపైనే సందిగ్ధత ఉందని పేర్కొన్నాయి. ఈ చర్చల్లో ఓ రాష్ట్ర Dy.CM కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.