News September 11, 2025
తిరుమల చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

తిరుమల శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గాయత్రి అతిథి భవనం వద్దకు చేరుకున్నారు. ముందుగా ఆమెకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆమె తిరుమలలో బస చేసి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.
Similar News
News March 10, 2026
కడప జిల్లాలోని మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

కడప కార్పొరేషన్ సహా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. వీటికి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో 284 జారీ చేసింది. కడపకు కలెక్టర్, ప్రొద్దుటూరుకు జాయింట్ కలెక్టర్, మిగతా ఐదు పట్టణాలకు ఆర్డీవోలు స్పెషల్ ఆఫీసర్లుగా ఆరు నెలల పాటు విధుల్లో ఉండనున్నారు.
News March 10, 2026
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో ACB అధికారుల సోదాలు

విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ACB అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి రమణమూర్తితో పాటు పలువురు సిబ్బందిపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సోదాల్లో కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమ లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో లోతైన విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2026
బాసర నుంచి భద్రాద్రి వరకు.. ఆధ్యాత్మిక శోభ

గోదావరి పుష్కరాల లోపు బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. ముఖ్యంగా భద్రాచలం ఆలయ అభివృద్ధి ప్రణాళికను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన ఆమోదం పొందాలని సూచించారు.


