News September 11, 2025
వరంగల్: పెండింగ్ బిల్లుల చెల్లించాలని మంత్రికి వినతి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు రావాల్సిన బకాయిల బిల్లులు ఇప్పించాల్సిందిగా పోలీస్ సిబ్బంది మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించి మంత్రి బకాయిలలను ఇప్పించేందుకు ఆర్ధిక మంత్రితో మాట్లాడి పెండింగ్ బిల్స్ ఇప్పించేందు కృషి చేస్తానని పోలీస్ సిబ్బందికి హామీ ఇవ్వడం సిబ్బంది మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Similar News
News September 12, 2025
HNK: కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వండి: కలెక్టర్

ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణంలో జాప్యం చేసే కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణ పనులు, వైద్య సిబ్బంది సమయపాలన, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
News September 12, 2025
ములుగు: సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు ఇచ్చి సర్వే పూర్తి చేయాలని సూచించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, గ్రీవెన్స్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణను వేగవంతం చేయాలన్నారు.
News September 12, 2025
జనగామ: భూ భారతి దరఖాస్తులను వేగవంతం చేయాలి: కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన భూ భారతి, సాదా బైనామ, జాతీయ కుటుంబ లబ్ధి పథకం, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించారు. ఎమ్మార్వోల సందేహాలను నివృత్తి చేస్తూ, వేగవంతమైన పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.