News September 11, 2025
కరీంనగర్: అమ్మవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన మానసా దేవి అమ్మవారిని సినిమా హీరో శ్రీకాంత్, నటుడు భూపాల్ రాజ్, ప్రొడ్యూసర్ విజయ్ గురువారం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకుడు అమరనాథ్‌శర్మ మహా ఆశీర్వాదం ఇచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.
Similar News
News March 17, 2026
PDPL: మసీదుల ఏరియాలను పరిశీలించిన రామగుండం CP

రంజాన్ పర్వదినం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి పట్టణంలోని పలు మసీదులను సోమవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ముస్లిం సోదరులను కలిసి మాట్లాడారు. జగ్నేకీ రాత్ సందర్భంగా ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించుకునే విధంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. మసీదు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించారు.
News March 17, 2026
జగిత్యాల: బాధితులకు తక్షణ న్యాయం చేయాలి: ఎస్పీ

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన 14 మంది బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.
News March 17, 2026
ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


