News September 11, 2025

జగన్‌కు సభకు వచ్చే ధైర్యం లేదు: దేవినేని

image

తన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ చేసిన అవినీతిని, వైద్య రంగంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం సభలో ఉంచుతుందని చెప్పారు. దమ్ముంటే జగన్ సభకు రావాలని సవాల్ విసిరారు.

Similar News

News March 3, 2026

డ్రోన్ల యుద్ధం!

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వాడుతున్నారు. ఇవాళ రియాద్‌పై, నిన్న అరామ్‌కో ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్ డ్రోన్లతోనే దాడి చేసింది. మిస్సైళ్ల‌తో పోలిస్తే ధర చాలా తక్కువ కావడంతో వీటి వాడకం ఎక్కువైంది. ఇరాన్ Shahed-136 సిరీస్, తుఫాన్.. అమెరికా లూకాస్ డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఒక్కో డ్రోన్ ధర సుమారు $35,000–$50,000 కాగా, ఓ మీడియం రేంజ్ మిస్సైల్ ధర $2M-$3M ఉంటుంది.

News March 3, 2026

హోలీ వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

image

హోలీని శాంతియుతంగా, స్వీయ భద్రతా జాగ్రత్తలతో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు వీలైనంత వరకు సహజసిద్ధమైన రంగులనే వాడాలని కోరారు. యువత, చిన్నారులు ఉత్సాహంలో వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాల్లో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని హెచ్చరించారు. ఈత రాని వారు నీటిలోకి వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

News March 3, 2026

KNR: వన్యప్రాణుల రక్షణ.. మనందరి బాధ్యత!

image

ఉమ్మడి KNR జిల్లాలో దట్టమైన అడవులతో పాటు గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉండటం వల్ల వన్యప్రాణులకు ఇది ప్రధాన ఆవాసంగా మారింది. ప్రకృతిలో అంతర్భాగమైన వన్యప్రాణులను కాపాడుకోవడమే లక్ష్యంగా నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నాం. వన్యప్రాణులు అంతరిస్తే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి, కేవలం అటవీ శాఖే కాకుండా ప్రతి పౌరుడు వన్యప్రాణుల సంరక్షణను ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.