News September 11, 2025
రామగుండం: కేంద్ర ప్రభుత్వ పథకంపై అవగాహన కల్పించాలని వినతి

కుటుంబ యజమాని మరణిస్తే కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ లబ్ధి పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సహాయం పొందవచ్చని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్ పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీని గురువారం కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అర్హులైన వారు చాలా మంది ఈ ప్రయోజనం పొందలేకపోతున్నారన్నారు.
Similar News
News March 13, 2026
వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు నేటి నుంచి కొత్త విధానం

TG: వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. నేటి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ వెల్లడించింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్20, ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపింది. 2 పని దినాల్లో వాటిని ఆమోదించాలని అధికారులను ఆదేశించింది. నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
News March 13, 2026
అనకాపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై నివేదిక

అనకాపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన బొజ్జన్న కొండ, కొండకర్ల ఆవ, సముద్రతీర ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు కలెక్టర్ విజయ కృష్ణన్ నివేదికను అందజేశారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కలెక్టర్లకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News March 13, 2026
ఉగాది కానుక.. నేడు అకౌంట్లలోకి రూ.6వేలు

పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ఇవాళ PM మోదీ అస్సాం పర్యటనలో 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. 9.32Cr మంది ఖాతాల్లో ₹2K చొప్పున జమ చేస్తారు. అలాగే APలో ఉగాది కానుకగా PM KISANతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM CBN కృష్ణా(D) గన్నవరంలో రిలీజ్ చేస్తారు. 46.85L మంది అకౌంట్లలో ₹6K చొప్పున(₹2K+₹4K) జమ చేస్తారు. ఈ జాబితాలో మీ పేరుందో లేదో <


