News September 11, 2025
ఘనంగా టీయూ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి 19సం.రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్సిటీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం వీసీ ప్రొ. టి.యాదగిరి రావు నేతృత్వంలో ఘనంగా చేపట్టారు. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి ఇతర ఆచార్యులతో కలిసి కేక్ కట్ చేశారు. 2006 సెప్టెంబర్ 11న 12మంది అధ్యాపకులు, ఆరు కోర్సులతో ప్రారంభమైన వర్సిటీ గడిచిన 19 ఏళ్లలో రాష్ట్రంలో మూడవ అతిపెద్ద వర్సిటీగా పరిణామం చెందడం గర్వంగా ఉందన్నారు.
Similar News
News March 12, 2026
సంజూకు జట్టే ముఖ్యం.. సెంచరీలు కాదు: సూర్య

T20WCలో అదరగొట్టిన సంజూ శాంసన్‌పై కెప్టెన్ సూర్య ప్రశంసలు కురిపించారు. ‘చివరి 3 మ్యాచుల్లో ఆయన 97*, 89, 89 స్కోర్లు చేశారు. కావాలనుకుంటే వాటిని సెంచరీలుగా మలిచేవారు. కానీ 89 నుంచి 100కు చేరడానికి 10 బంతులను తీసుకుంటే నాన్ స్ట్రైకర్ నుంచి 6 బాల్స్‌ను లాగేసుకున్నట్లే. సంజూకు సెంచరీల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆయన అలా ఆడారు కాబట్టే దూబే 6 బంతుల్లో 28 రన్స్ కొట్టారు’ అని పేర్కొన్నారు.
News March 12, 2026
గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్త పుష్కర ఘాట్లు

ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాళేశ్వరం, రామన్నగూడెం, మంగపేట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ధి చేశారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముళ్ల కట్ట, రామన్నగూడెం, మల్లూరు, వెంకటాపురం ప్రాంతాల్లో కొత్తగా 10 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయడానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. వరంగల్ వాసులకు సులభతరంగా పుష్కర స్నానాలు ఆచరించవచ్చు.
News March 12, 2026
ప్రజాప్రతినిధులకు ‘ప్రగతి ప్రణాళిక’ శిక్షణ ప్రారంభం

సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగాతే, అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో నిధుల వినియోగం, సంక్షేమ పథకాల అమలుపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడమే ఈ శిక్షణ లక్ష్యమన్నారు.


