News September 11, 2025
అమరావతిలో బ్యాంకర్ల బృందం పర్యటన

AP: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల బృందం పర్యటించింది. నగర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టు కింద అమలవుతున్న పర్యావరణ, సామాజిక రక్షణ కార్యకలాపాలను పరిశీలించింది. CRDA అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులకు సూచనలు చేసింది. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నర్సరీ, CRDA స్కిల్ హబ్ ప్రాంగణం, N9 ట్రంక్ రోడ్ పనులు, శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్‌ల వద్ద రక్షణ చర్యలను చెక్ చేసింది.
Similar News
News September 12, 2025
త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్‌తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
SBIలో 122 ఉద్యోగాలు

SBI 122 పోస్టుల భర్తీకి <
News September 12, 2025
లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్.. త్వరలో కొత్త రూల్?

లోన్‌పై కొనుగోలు చేసిన ఫోన్ల విషయంలో RBI కొత్త రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సకాలంలో లోన్ చెల్లించకపోతే ఫోన్లను రిమోట్ విధానంలో లాక్ చేసేలా రుణదాతలకు RBI అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ‘దీనికి యూజర్ల ముందస్తు అనుమతి, డేటా ప్రొటెక్షన్‌ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందించనుంది. ఫోన్ లాక్ అయ్యేందుకు అందులో ముందే ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు’ అని పేర్కొంది.