News September 11, 2025
KCR పరిపాలన కోల్పోవడం దురదృష్టం: సబితారెడ్డి

KCR పరిపాలన కోల్పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని MLA సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాబాద్‌లో మాజీ ZPTC అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం BRS దే అని ధీమా వ్యక్తం చేశారు. RSప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, కౌశిక్‌రెడ్డి, రాజేందర్ గౌడ్, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, నరేందర్ ఉన్నారు.
Similar News
News March 17, 2026
సంగారెడ్డి: రేపు 10వ తరగతి ద్వితీయ భాష పరీక్ష

పదో తరగతి విద్యార్థులకు బుధవారం ద్వితీయ భాషా పరీక్ష జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తెలుగు మీడియం విద్యార్థులకు హిందీ, ఉర్దూ మీడియం విద్యార్థులకు తెలుగు పరీక్ష జరుగుతుందని చెప్పారు. పరీక్షా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News March 17, 2026
HYD: సమ్మర్.. METROనే బెటర్..!

పెరుగుతున్న ఎండలతో HYD జనం ఇప్పుడు ఎక్కువగా METROలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. RTCతో పోల్చితే టికెట్ ధరలు ఇంచుమించు ఒకేళా ఉండడంతో మెట్రో జర్నీనే బెటర్ అంటున్నారు. ఇందుకు ముఖ్య కారణాలు సిటీలో పర్సనల్ వెహికిల్‌లో ట్రావెల్ చేయాలన్నా, RTC బస్సులో వెళ్లాలన్నా ట్రాఫిక్ తిప్పలతో పాటు ఉక్కపోత. పైగా గంటలో వెళ్లాల్సిన చోటుకు 20- 30 నిమిషాల్లోనే ACలో వెళ్తుండటంతో చాలామంది వీటినే ప్రిఫర్ చేస్తున్నారు.