News September 11, 2025

HYD: మ్యాన్ హోల్ ఘటనపై స్పందించిన హైడ్రా

image

పాతబస్తీలోని యాకుత్‌పురాలో మ్యాన్ హోల్‌లో పడిపోయిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో హైడ్రా ఊపిరి పీల్చుకుంది. బాధ్యులు ఎవరినే దానిపై ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక కార్పొరేటర్ ఆదేశాల మేరకు మట్టి తీసే పనిని హైడ్రా చేపట్టగా.. గట్టిగా ఉండడంతో జలమండలి మిషన్లతో తొలగించాలని నిర్ణయించారు. జలమండలి సిబ్బంది పని అయిన తర్వాత మ్యాన్ హోల్ మూత వేయకుండా వెళ్లిపోయినట్లు ప్రాథమిక సమాచారం.

Similar News

News March 14, 2026

HYD: ఓల్డ్ సిటీ ఇక ‘హైటెక్’ గుమ్మం!

image

ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన టోలిచౌకీ వాసులకు త్వరలో కొత్త అనుభూతి పలకరించనుంది. టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా వరకు రోడ్డు మధ్యలో పచ్చని మీడియన్లు, ఫ్లైఓవర్ కింద అందమైన జంక్షన్లతో ఈ ప్రాంతం సరికొత్తగా ముస్తాబవుతోంది. సుమారు రూ.3.05 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ప్రయాణికులకు కంటికి ఇంపుగా, మనసుకు హాయినివ్వనున్నాయి. భాగ్యనగర వైభవం మీ గుమ్మం ముందుకు రాబోతోంది.

News March 14, 2026

సమ్మర్ ఎఫెక్ట్.. HYDలో KG@325

image

ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ.325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ.286గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు. మీ ఏరియాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 14, 2026

HYD: రూ.5‌కే భోజనం.. గ్యాస్ ఇబ్బందులు లేవు!

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5 కే భోజనానికి గ్యాస్ ఇబ్బంది ఇప్పట్లో లేనట్లే. ఎందుకంటే ఇక్కడ అన్నం, పప్పును సోలార్ ప్యానల్ ద్వారా వచ్చే విద్యుత్‌తో వండుతారు. తక్కువ మొత్తంలో మాత్రమే గ్యాస్ వినియోగం ఉంటుంది. అయితే దీనికి నిల్వలు ఉన్నాయని, మరికొంత కాలం ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే రీతిలో అందరూ వాడితే గ్యాస్ వినియోగం తగ్గించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.