News September 11, 2025

కరీంనగర్: తల్లికి 3 నెలల డబ్బులు చెల్లించాలని ఆదేశం

image

శంకరపట్నం మండలం మొలంగూర్ వాసి మరాఠీ రాజమ్మ తన కుమారుడు పట్టించుకోవడంలేదని డిసెంబర్ 2024లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో నెలకు రూ.6 వేలు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. గురువారం డీవీసీ కౌన్సిలర్ పద్మావతి, DHEW కవిత విచారణలో 3 నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని రాజమ్మ తెలపగా తల్లి ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయాలని కుమారుడిని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సమ్మయ్య, పోలీసులు ఉన్నారు.

Similar News

News March 13, 2026

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించారా?

image

TG: ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా వేస్తున్నారు. పాడి రైతులు నిర్లక్ష్యం చేయకుండా జీవాలకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని, ఏమైనా సందేహాలుంటే సమీపంలోని వెటర్నరీ డాక్టర్లను సంప్రందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.

News March 13, 2026

సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

image

TG: సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.

News March 13, 2026

కొబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే..

image

కొబ్బరినూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. కొబ్బరినూనెను కాస్త వేడిచేసి అందులో కాస్త ఉసిరి పొడిని వేయాలి. ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా గంట పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చెయ్యాలి. దీని వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.