News September 11, 2025
నేపాల్ నుంచి సురక్షితంగా విశాఖ చేరుకున్న సిక్కోలు వాసులు

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వాసులు గురువారం సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా వాసులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం కలిసి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో జిల్లా వాసులను క్షేమంగా తీసుకురాగలిగామన్నారు.
Similar News
News March 22, 2026
అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా?

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పాలకమండలి లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. 2022 నవంబర్ తర్వాత పాలకమండలి సమావేశం జరగలేదు. పాలకమండలిలో 12 మంది సభ్యులు ఉంటారు, ఏడుగురు అత్యవసర సభ్యులు. కాగా ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా మండలి సమావేశం జరగాలి. అయితే అలా జరగడం లేదు. దీంతో పాలన గాడి తప్పిందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు.
News March 22, 2026
శ్రీకాకుళం: కమర్షియల్ గ్యాస్ కొరత… మూతపడుతున్న హోటల్స్

శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస, పలాస కాశిబుగ్గ, ఇచ్చాపురం వంటి పట్టణాలు, నరసన్నపేట, పొందూరు వంటి ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత సమస్యగా మారింది. దీంతో హోటల్లో మూతపడుతున్నాయి. జిల్లాలో 400 వరకు హోటల్స్ ఉన్నాయి. హోటళ్ల సంక్షోభం అల్పాహారం, భోజనం కోసం ఆధారపడే వారితోపాటు, హోటల్లో పనిచేస్తున్న వారిపై సైతం ప్రభావం చూపుతుంది. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
News March 22, 2026
మూలపేట పోర్ట్ సకాలంలో పూర్తయ్యేనా ?

టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్ట్ పనులు జాప్యంపై వైసీపీ పార్టీ సందర్శనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పోర్ట్ ఎప్పటికీ పూర్తయ్యేను? అన్న చర్చ సాగుతుంది. 2023 ఏప్రిల్ 19న రూ.2,949.70 కోట్ల అంచనాతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనులు ప్రారంభించారు. 2025 అక్టోబర్ 17న డెడ్ లైన్ నిర్ణయించారు. మళ్లీ 2026 నవంబరుకి పెంచారు. గడువులోగా పూర్తయ్యేనా అన్నది ప్రధాన చర్చ…!


