News September 11, 2025
NRPT: వరద నష్టంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

నిరంతరం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టలు, స్కూల్ భవనలు, వసతి గృహాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్లకు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబందించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వరద నష్టంపై గురువారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ అధికారులతో సమీక్ష చేశారు. మండలాల వారిగా నివేదికలు తయారు చేయాలన్నారు.
Similar News
News September 12, 2025
త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్‌తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
సంగారెడ్డి: నేడు జాబ్ మేళా

సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 12న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్ గురువారం తెలిపారు. ఫార్మసీలో ఫార్మసిస్ట్, అన్నపూర్ణ ఫైనాన్స్‌లో ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పదో తరగతి, బీ ఫార్మసీ అర్హత ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.
News September 12, 2025
అవాల్గావ్ గ్రామ శివారులో చిరుత సంచారం?

మద్నూర్ మండలం అవాల్గావ్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గురువారం గ్రామ శివారులో రైతులు చిరుత పులి పాద ముద్రల ఆనవాళ్లను చూశారు. దీంతో భయభ్రాంతులకు గురై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతపులి ఆనవాళ్లను పరిశీలించారు. గ్రామస్థులు, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.