News September 11, 2025
మిలాద్-ఉన్-నబీ, నవరాత్రుల భద్రతపై HYD సీపీ సమీక్ష

నగర సీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగర పోలీసు అధికారులతో సమావేశమై సెప్టెంబర్ 14న జరగనున్న మిలాద్-ఉన్-నబీ జూలూస్, రాబోయే దుర్గానవరాత్రి వేడుకల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు ప్రణాళికలు వివరించగా, సీపీ కఠినమైన ప్రోటోకాల్స్ పాటించాలని, విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అని సూచించారు.గణేశ్ నవరాత్రులలో పోలీసుల పనితీరును ప్రశంసించిన ఆయన, రాబోయే పండుగల్లోనూ అదే నిబద్ధత చూపాలన్నారు.
Similar News
News March 13, 2026
HYD: టిఫిన్‌పై ₹20, చాయ్‌పై ₹5 ఎక్స్‌ట్రా

గ్యాస్ కొరత నగరవాసుల జేబు ఖాళీ చేస్తోందని పలువురు వాపోతున్నారు. నిజాంపేట్‌లోని ఓ హోటల్ వద్ద ‘గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్ని ఐటమ్స్ మీద ₹20 అదనం’ అని రాసిన ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. ₹40 ఉండే టిఫిన్‌పై పెంచిన ధర 50% కావడం గమనార్హం. నగరవ్యాప్తంగా చాయ్ మీద ₹5 పెంచినట్లు నిర్వాహకుల చెబుతుండటం ధరల పెరుగుదల తీవ్రతను తెలియజేస్తోంది. చాలా చోట్ల టిఫిన్ సెంటర్లు మూసేశారు. మీ ఏరియాలోనూ ధరలు పెంచారా?
News March 13, 2026
HYD: ఫ్యాన్సీ నంబర్లతో భారీగా ఆదాయం

ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకొనేందుకే వాహనదారులు పోటీ పడ్డారు. TG 09 L 0009ను రూ.10,50,000కు, TG 09 L 0007కు రూ.3,19,999, TG 09 L 0005ను రూ.2,00,005కు, TG 09 K 9999ను రూ.1.5 లక్షలకు, TG 09 L 0024ను రూ.1.24 లక్షలకు, TG 09 L 0001ను రూ.లక్షకు దక్కించుకున్నారు. ఈ నంబర్లతో RTA ఆఫీస్‌కు రూ.31,14,730 ఆదాయం వచ్చింది.
News March 13, 2026
HYD: రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక

HYDలో రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి ప్లేటు ఖరీదు దాదాపు రూ 24.25 అవుతుండగా, సామాన్యుడు చెల్లించేది రూ.5 మాత్రమే. మిగిలిన రూ.19.25 సబ్సిడీని GHMC భరిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా రూ.కోట్లు కేటాయిస్తోంది. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ కేవలం వంట వండటమే కాకుండా నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ బాధ్యతను తీసుకుంది. ఈ సమన్వయం వల్లే నగరంలో రోజూ <<19364297>>45 వేల<<>> మందికి పైగా ఆకలి తీరుతోంది.


