News September 12, 2025

పెద్దపల్లి: అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

image

ముత్తారం మండలం దర్యాప్పూర్‌లో రూ.2.80 కోట్లు, పోతారం వద్ద రూ.2.20 కోట్లతో నిర్మించనున్న సబ్ స్టేషన్ పనులకు గురువారం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. అదనంగా డీఎంఎఫ్టీ నిధులతో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులకు రూ.2.81 కోట్ల పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులు గ్రామీణ ప్రజలకు స్థిరమైన లాభాలను అందిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News March 15, 2026

వరంగల్ జిల్లాలో నిబంధనలు బేఖాతరు !

image

వరంగల్ జిల్లాలో కొన్ని మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులను విక్రయిస్తున్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మి సోమ్ము చేసుకుంటున్నాయి. ఇటీవల హన్మకొండలో మత్తులో ఉన్న యువకులను నార్కోటిక్ పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో కాజీపేటలో ఇలాంటి ఘటనే జరగ్గా, తాజాగా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని ఓ షాపును అధికారులు సీజ్ చేశారు.

బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

image

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్‌ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్‌ (లేదా) 2mlహెక్సాకొనజోల్‌ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్‌ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్‌ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్‌ కలిపి పిచికారీ చేయాలి.