News September 12, 2025
జగిత్యాల: ఈనెల 20న క్రీడా పోటీలు

జగిత్యాల యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 20న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలతోపాటు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిమ్మకాయ చెంచా, మ్యూజికల్ ఛైర్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 12, 2025
భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్య లక్ష్మిదేవిని గొడ్డలితో హత్య చేసిన రాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో జైలుకు తరలించినట్టు ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
News September 12, 2025
ఈ నెల 16 నుంచి MBBS, BDS కౌన్సెలింగ్

TG: MBBS, BDS ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. 15న జనరల్ మెరిట్ లిస్టును వెబ్‌సైట్‌లో పెట్టనుండగా, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ 16న ప్రారంభవుతుంది. 17-19 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20-24 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్, 2nd ఫేజ్‌లో 26-28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 29న కాలేజీల్లో రిపోర్టింగ్ ఉంటుంది.
News September 12, 2025
దసరాకు ‘ఆదిత్య 999’ సినిమా ప్రకటన?

క్రిష్ జాగర్లమూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ‘ఆదిత్య 999’ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై దసరా పండుగ రోజున అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి బాలయ్యే స్టోరీ అందించినట్లు సమాచారం. గతంలో క్రిష్-బాలయ్య కాంబోలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.