News September 12, 2025
HYDలో దంచి కొడుతున్న వర్షం.. రికార్డు ఇదే!

HYD వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. నిన్న కురిసిన వర్షానికి దాదాపు 5 రేట్ల వర్షం పడిందని TGPDS తెలిపింది. హయత్‌నగర్‌లో గరిష్ఠంగా 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. డిఫెన్స్ కాలనీలో 102.3, వనస్థలిపురం 44.5, గచ్చిబౌలి 19.5, ముషీరాబాద్ 15.5, కూకట్‌పల్లిలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు తెలిపింది. రేపు సైతం మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Similar News
News March 14, 2026
కడప: 2 వారాల గడువు..రూ.97 కోట్లే లక్ష్యం.!

జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.97.17 కోట్లు పేరుకు పోయాయి. 2 వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల వారీగా బకాయిలు ఇలా (రూ.కోట్లలో) ఉన్నాయి. *KDP – రూ.62.93 *PDTR – రూ.20.14 *PLVD – రూ.4.58 *జమ్మలమడుగు – రూ.2.49
*ఎర్రగుంట్ల – రూ.3.20 *మైదుకూరు – రూ.3.09 *కమలాపురం – రూ.0.74కోట్లు.
News March 14, 2026
నంగునూరు: కేజీబీవీలో మెనూపై కలెక్టర్ సీరియస్

నంగునూరు మండలం నర్మేట KGBVని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్.. టమాట పప్పు నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకుఇబ్బందులు కలగకుండా చూడాలని ఎస్ఓకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
News March 14, 2026
థర్డ్ పార్టీ అప్లికేషన్లపై అప్రమత్తంగా ఉండాలి: ADB SP

తెలియని థర్డ్ పార్టీ అప్లికేషన్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వీటి ద్వారా డాటా చోరీ, మొబైల్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ వారం 14 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.


