News September 12, 2025

QR కోడ్‌తో రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పు: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతికత రేషన్ పంపిణీలో ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో మాట్లాడారు. స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సకాలంలో సమర్థవంతంగా అందుతుందని తెలిపారు. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ విధానం రేషన్ పంపిణీలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News March 21, 2026

తరిగొప్పుల రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని యువకుడి మృతి

image

కృష్ణా జిల్లా తరిగొప్పుల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ వద్ద గుర్తుతెలియని యువకుడు(సుమారు 25-30 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసిన వారు వెంటనే గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భీమవరం రైల్వే జీఆర్‌పీ సుబ్రహ్మణ్యం కోరారు. మృతుని ఆచూకీ తెలిస్తే 92475 85713, 99890 29379 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విన్నవించారు.

News March 21, 2026

సిద్దిపేటలో యాక్సిడెంట్.. ఐదేళ్ల బాలుడి మృతి

image

సిద్దిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాములు, భారతి దంపతులకు వైష్ణవి, గంగారాం(5) పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం వచ్చిన రాములు ఫ్యామిలీతో కలిసి సిద్దిపేట 16వ వార్డులో ఉంటున్నారు. శుక్రవారం గంగారాం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News March 21, 2026

ఏలూరు:ఈతకు వెళ్లి మరణించిన ఇద్దరు మృతదేహాలు లభ్యం

image

కుక్కునూరు, వేలేరు గ్రామ పరిధిలోని గోదావరి నదిలో 7 యువకులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో ముగ్గురు మృతదేహాలను శుక్రవారం గుర్తించారు.SDRF,EDRF ప్రత్యేక బృందాలను పోలవరం డిఎస్పి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టగా ఇద్దరూ మృతదేహాలను శనివారం గుర్తించారు. సతీష్ కుమార్ మదనపల్లి, తేజాన్న ఉయ్యూరు గ్రామాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు.