News September 12, 2025

రాజమండ్రి: ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

అక్టోబర్ 2వ వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యం సేకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం రాజమండ్రిలో జరిగిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది గ్రేడ్ ‘ఏ’ రకానికి క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369 మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు.

Similar News

News March 7, 2026

తూ.గో: స్టూడెంట్స్‌తో మీనాక్షి చౌదరి డాన్స్

image

గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ లో జరుగుతున్న మైత్రి యువజనోత్సవాలలో శుక్రవారం రాత్రి నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి పాటలు పాడి డాన్స్ చేశారు. తాను దంతవైద్యం చదివి నటినయ్యానని.. విద్యార్థుల ఆనందం చూస్తుంటే తన చదువుకునే రోజులు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం మీనాక్షిని చాన్స్‌లర్ చైతన్య రాజు సత్కరించారు. భవిష్యత్తులో మీలోనే ఎందరో నటీనటులు రావచ్చని ఆమె ఆకాంక్షించారు.

News March 7, 2026

రాజమండ్రి: వాట్సాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్ పొందండిలా!

image

టెన్త్ పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్ధం వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా హాల్ టికెట్లు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. దీని కోసం 95523 00009 నంబర్ కు “Hi” అని మెసేజ్ పంపాలన్నారు. తదుపరి అందుబాటులో వచ్చే సేవల్లో “విద్యా సేవలు” ఎంపిక చేసి “SSC Hall Ticket” పై క్లిక్ చేయాలి. తర్వాత విద్యార్థి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే డౌన్‌లోడ్ అవుతుందన్నారు.

News March 7, 2026

పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్‌ కీర్తి చేకూరి

image

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు పహారా, రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.