News September 12, 2025

KMR: టాస్ అడ్మిషన్ డ్రైవ్ పై జిల్లా అధికారుల సమీక్ష

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ డ్రైవ్‌లో భాగంగా జిల్లా అబ్జర్వర్, స్టేట్ కోఆర్డినేటర్ క్రాంతి రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్‌ను కలిశారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రాధాన్యత, ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియపై చర్చించారు. చందర్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రాపౌట్స్ విద్యార్థులను గుర్తించి, వారిని చెడు వ్యసనాల బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News April 1, 2026

NRPT: జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు

image

జిల్లాలో ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, కర్షక, యువజన, కుల సంఘాల నేతలు బహిరంగ సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారాదని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 1, 2026

పెన్షన్‌ల పంపిణీ సక్రమంగా జరగాలి: అనకాపల్లి కలెక్టర్

image

ప్రతి లబ్ధిదారునికి పెన్షన్‌లు సక్రమంగా అందేలా పంపిణీ పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం 84వ వార్డు పెరుగు బజారులో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 2,53,356 మంది లబ్ధిదారులకు రూ.107,75,70,500 పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. శత శాతం పంపిణీ మొదటి రోజే పూర్తి చేయాలన్నారు.

News April 1, 2026

NLG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. నిర్మాణంలో జాప్యం

image

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు జాప్యంతో సాగుతున్నాయి. గంధంవారిగూడెంలో ఒక బ్లాక్ మినహా మిగిలినవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మునుగోడు, గడ్డిపల్లి, చిలుకూరు, తుర్కపల్లిలో నిర్మాణాలు ఆరంభంలోనే ఉండగా, నకిరేకల్‌లో స్థలసేకరణ మాత్రమే పూర్తయింది. సాగర్, DVK, MLGలో అసంపూర్తిగా ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి స్కూళ్లు సిద్ధం కావడం కష్టంగానే ఉంది.