News September 12, 2025
పెద్దపల్లి: ఈ నెల 16న కలెక్టరేట్‌లో జాబ్ మేళా

పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఉపాధికల్పన అధికారి తిరుపతిరావు తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్‌లు వెంట తీసుకురావాలని సూచించారు.
Similar News
News March 4, 2026
UPDATE: పట్టుబడిన ముఠా సభ్యులు వీరే: CP

అంతర్ రాష్ట్ర కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను NZB పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఠాలో అఫ్జల్ ఖాన్, అర్బాజ్, అన్సార్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్, మమ్మద్ అప్సర్, మహబూబ్ ఖాన్, షేక్ ఆరిఫ్, మహమ్మద్ రాజా, బోర్గే బాలాజీ అను 10 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CP సాయి చైతన్య చెప్పారు. ఆన్సర్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్ అనే ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు.
News March 4, 2026
శరవేగంగా భోగాపురం, విజయవాడ విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి

విజయవాడ, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నిర్మాణం చేపడుతున్న సంస్థల ప్రతినిధులు రెండింటి నిర్మాణ పురోగతిని ఈ సందర్భంగా వివరించారు. అభివృద్ధి దిశను మార్చబోతున్న ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాత రాష్ట్ర ప్రజల కనెక్టివిటి మరింత పెరగబోతోందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
News March 4, 2026
ప్రొద్దుటూరు: జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ASP

మాజీ సీఎం YS జగన్ ఈనెల 5న ప్రొద్దుటూరుకు రానున్న విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం YS జగన్ పర్యటన బందోబస్తు, హెలిప్యాడ్ ఏర్పాట్లను మంగళవారం ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ పరిశీలించారు. 1-టౌన్ సీఐ కొండారెడ్డి, రూరల్ సీఐ నాగభూషణ్‌తో కలిసి ASP తనిఖీ చేశారు. నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రొద్దుటూరుకు YS జగన్ వస్తున్నారు.


