News September 12, 2025

నంద్యాల మీదుగా తిరుపతికి మరో రైలు

image

చర్లపల్లి నుంచి నంద్యాల మీదుగా తిరుపతికి మరో రైలు ప్రయాణించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైలు ఈనెల 18న చర్లపల్లిలో బయలుదేరి 19న ఉదయం 5:30 నిమిషాలకు నంద్యాల చేరి, తిరుపతి వెళ్తుందన్నారు. వన్ వే రైలుగా దీనిని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే మరో రైలు చర్లపల్లి నుంచి ప్రతి మంగళవారం బయలుదేరి బుధవారం నంద్యాల చేరి అనంతరం తిరుపతికి వెళ్తూ ప్రయాణికులకు సేవలందిస్తుందన్నారు.

Similar News

News March 17, 2026

డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం: కలెక్టర్

image

ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్‌కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు(AI) ద్వారా రూపొందుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు.

News March 17, 2026

TU: కొనసాగుతున్న M.Ed మూడవ సెమిస్టరు పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఎడ్ (M.Ed) 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన ‘ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పరీక్షకు 29 మంది విద్యార్థులకు 28 మంది విద్యార్థులు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదన్నారు.

News March 17, 2026

GNT: ఐదుగురు సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్

image

గుంటూరు రేంజ్‌కు చెందిన ఐదుగురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. షేక్ అబ్దుల్ బషీర్, పి.బాలాజీ, బి.నరసింహారావు, జి.తిరుమలరావు, ఆలహరి శ్రీనివాస్‌లకు ఈ ప్రమోషన్ దక్కింది. వీరంతా వెంటనే మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశించారు. ప్రమోషన్ పొందిన వారు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని స్పష్టం చేశారు.