News September 12, 2025
భద్రాద్రి జిల్లా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ డీఎస్పీగా అశోక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ డిఎస్పీగా బి.అశోక్ నియమిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం కోఆర్డినేషన్ సెంటర్ డీఎస్పీగా అశోక్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజును ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి డీఎస్పీ అశోక్ పూల మొక్కను అందజేశారు. అనంతరం సైబర్ క్రైమ్ అంశాలపై ఇరువురు చర్చించారు.
Similar News
News March 14, 2026
అభిమానుల కోసం CSK కీలక ప్రకటన

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 22న ROAR-26 పేరుతో మెగా ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు CSK ప్రకటించింది. ఇలా చేయడం ఇదే తొలిసారని పేర్కొంది. మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, మాథ్యూ హెడెన్, విజయ్, బద్రీనాథ్ తదితరులతో కూడిన OG సూపర్ కింగ్స్ ప్రస్తుత టీమ్‌తో తలపడనున్నట్లు తెలిపింది. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్పెషల్ లైవ్ ప్రదర్శన ఇస్తారని వెల్లడించింది.
News March 14, 2026
మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్

నందిగరువులో నిర్వహించిన మాటా మంతీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలు విని కొన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అందుకే నేరుగా వచ్చి సమస్యల వింటున్నామన్నారు. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపుతో ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని, తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గిరిశిఖర గ్రామాల్లో 460 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామన్నారు.
News March 14, 2026
GWL: సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు

గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పోలీసు, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సమస్యల తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లుకు గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు.


