News September 12, 2025

ఖమ్మం: అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్&బి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపాలిటీ వంటి శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రస్తుత పనులపై వివరాలు తెలుసుకున్నారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

Similar News

News March 10, 2026

ఖమ్మం: ఇంటర్‌ పరీక్షలో విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసు

image

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఓ విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని ఓ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డీఐఈఓ రవిబాబు వెల్లడించారు. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,849 మంది హాజరుకాగా, 502 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News March 10, 2026

ఖమ్మం: చెక్కు బౌన్స్‌.. నిందితుడికి జైలు శిక్ష

image

చెక్కు బౌన్స్‌ కేసులో శ్రీరాంనగర్‌కు చెందిన జి.విద్యాసాగర్‌కు ఖమ్మం కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2017లో బానోత్ శరత్ వద్ద తీసుకున్న రూ.2 లక్షల అప్పు కోసం విద్యాసాగర్ ఇచ్చిన చెక్కు తిరస్కరణకు గురైంది. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి బెక్కమ్ రజని నిందితుడికి 3 నెలల జైలు శిక్షతో పాటు, బాధితుడికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పునిచ్చారు.

News March 10, 2026

ఖమ్మంలో తెల్లవారుజామున కవిత అరెస్టు

image

ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం అంబేడ్కర్‌ భవన్‌ వద్ద డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌తో కలిసి ఆమె దీక్షకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ వైపు తరలించారు. పోలీసులకు, బాధితులకు మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.