News September 12, 2025
విశాఖలో V-PULL వ్యవస్థ బలోపేతం: జీవీఎంసీ కమిషనర్

జీవీఎంసీ బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్-2025లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 50 ఫైనలిస్ట్ నగరాల్లో ఒకటిగా నిలిచిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన V-PULL వ్యవస్థను బలోపేతం చేసి సంస్థాగతం చేయాలని గురువారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సూచించారు. ప్రజలు, నిపుణులు, సంస్థలు కలిసి కో-క్రియేషన్ పద్ధతిలో పట్టణ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని జీవీఎంసీ కమిషనర్ పిలుపునిచ్చారు.
Similar News
News March 14, 2026
విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
News March 14, 2026
మధురవాడలో కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి

మధురవాడ ఆర్టీసీ కాలనీ సాయిప్రియ నివాస్ సమీపంలో స్వతంత్రనగర్‌కు చెందిన కారు డ్రైవర్ కుమ్మరపు రవి (41) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆయన, శుక్రవారం ఉదయం పొదల్లో మృతదేహమై కనిపించారు. వాంబే కాలనీ వద్ద కారు నిలిపి, నడుచుకుంటూ వచ్చి అక్కడ పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రవి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2026
విశాఖ: ‘నేడు పాఠశాలల సెలవు రద్దు’

జిల్లాలో మార్చి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈఓ ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో వరుస సెలవులు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా ఈరోజు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.


