News April 4, 2024
NLG: టెన్త్ మూల్యాంకనం షురూ.. వారికి షోకాజ్ నోటీస్

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. NLGలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ ప్రక్రియ చేపట్టారు. మూల్యాంకనం కోసం 92 మంది చీఫ్ ఎగ్జామినర్లను నియమించగా.. 72 మంది రిపోర్టు చేశారు. 551 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గాను 452 మంది, 184 మంది స్పెషల్ అసిస్టెంట్లకు గాను 142 మంది రిపోర్టు చేసి మూల్యాంకనంలో పాల్గొన్నారు. మూల్యాంకనానికి హాజరు కాని వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Similar News
News November 7, 2025
పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
News November 7, 2025
Way2News కథనానికి నల్గొండ కలెక్టర్ స్పందన

‘ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా?’అనే శీర్షికతో ఈ నెల 4న Way2Newsలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలోని ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News November 7, 2025
బాలల హక్కులు, విద్యపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

నల్గొండ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గురువారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు హరిత, చందనలతో ఆమె సమావేశమయ్యారు. విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడంతో విద్యా వ్యవస్థ బలోపేతమైందని కలెక్టర్ వెల్లడించారు. బాల్య వివాహాలు, శిశు విక్రయాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.


