News September 12, 2025

SRD: 15,16 తేదీలో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు 15, 16 తేదీల్లో బీరం గూడలోని వీరస్వామి బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అండర్-14, 17 పోటీలు జరుగుతాయని చెప్పారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్, జనన ద్రవీకరణ పత్రంతో 9 గంటలకు హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 94416 48019 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 14, 2026

తానూర్‌లో దొంగల బీభత్సం

image

తానూర్ మండలంలోని బోసి గ్రామంలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్సై షేక్ జుబేర్ వివరాల ప్రకారం.. అర్జాపూర్ గంగాధర్ కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు ఇంటి తాళం పగలగొట్టి రూ.79 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయినాథ్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా రూ.1000 నగదు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు.

News March 14, 2026

జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

image

జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ‘జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సీఎస్ సూచనల మేరకు తన అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ కంపెనీల మేనేజర్లు, ఆర్‌టీఓ, డిఎంహెచ్ఓ సభ్యులుగా ఉంటారని, గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.

News March 14, 2026

మంచిర్యాల: జిల్లాలో గ్యాస్ కొరత లేదు

image

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్పిజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల కొరతలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించారు.