News September 12, 2025

నిర్మల్: సబ్ కలెక్టర్‌కు పాలజ్ గణేశుని లడ్డు

image

మహారాష్ట్రలోని సుప్రసిద్ధ పాలజ్ కర్ర వినాయకుని మహిమాన్విత లడ్డు ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకున్న కుబీర్ మండలానికి చెందిన డాక్టర్ సాప పండరి గురువారం భైంసా సబ్ కలెక్టర్ అజ్మేరా సాంకేత్ కుమార్ను కలిసి అందజేశారు. అనంతరం డాక్టర్ పండరి మాట్లాడుతూ.. కుబీర్ మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు.

Similar News

News March 10, 2026

క్షమాపణ కోరిన NCERT

image

8వ తరగతి పుస్తకంలో <<19253509>>‘న్యాయ వ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై వివాదం చెలరేగడంతో NCERT బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పింది. ఇప్పటికే ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ పుస్తకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా ఆ పాఠ్యాంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 10, 2026

పిఠాపురం: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో మార్పు

image

జనసేన పార్టీ మార్చి 14వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని మార్పు చేపట్టింది. గతంలో భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో సభ ఏర్పాటు చేసేవారు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు వాతావరణ పరిస్థితులు దృష్ట్యా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో పార్టీ జెండాని ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదల చేశారు.

News March 10, 2026

మెదక్: రూ.1.50 లక్షలకు శిశువు విక్రయం?

image

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాని పల్లి తండాలో ఓ గిరిజన మహిళ తన మగ శిశువును రూ.1.50 లక్షలకు విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 10న మెదక్ MCHలో జన్మించిన శిశువు, ఈ నెల 4 నుంచి కనిపించకపోవడంతో స్థానికులు ఆరా తీశారు. అధికారుల విచారణలో బిడ్డను విక్రయించినట్లు తేలింది. సమాచారం అందుకున్న ICDS అధికారులు, పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.