News September 12, 2025
మంచిర్యాల: పత్తి కొనుగోలుకు రైతులను సిద్ధం చేయాలి: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు రైతులను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది పత్తి పంటకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు ₹8,110గా నిర్ణయించామని, ఇది గత ఏడాది కంటే ₹589 ఎక్కువ అని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 19, 2026
నిజామాబాద్: ‘బ్యాంక్ ఖాతాలు విక్రయం.. ఐదుగురి అరెస్ట్’

నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఖాతాల ద్వారా మూడు నెలల్లో రూ.31 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇంకా మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో విచారణ కొనసాగుతోంది. ప్రజలు తమ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని సీపీ హెచ్చరించారు.
News March 19, 2026
ఉగాది ఈవెంట్ సన్నాహాలను పరిశీలించిన కలెక్టర్ డా.లక్ష్మీశ

విజయవాడలోని అంబేడ్కర్ కన్వెన్షన్ హాలులో జరగనున్న ఉగాది ఈవెంట్ సన్నాహాలను జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. ఈవెంట్ నిర్వహిస్తున్న AP క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్ పర్సన్ పి.తేజస్వి, JC ఇలక్కియకు కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని కళారత్న, ఉగాది పురస్కారాలను ప్రధానం చేయనున్నారు.
News March 19, 2026
ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం: కలెక్టర్

నూతన సంవత్సరాది ఉగాది పండుగను తెలుగు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అనంతపురం కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ గురువారం ఉగాది పండుగను జిల్లా సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


