News September 12, 2025

అనకాపల్లి: 16,000 దోమతెరల పంపిణీకి ఏర్పాట్లు

image

ఓ ప్రైవేట్ పరిశ్రమ సహకారంతో అనకాపల్లి జిల్లాలో 111 గ్రామాలకు 16,000 దోమతెరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ వంటి సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు కూడా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Similar News

News March 12, 2026

అల్లూరి జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు

image

ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకు ఉమ్మడి అల్లూరి జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో 72 సెంటర్స్‌కు సంబంధించిన సెట్ 1,2 ప్రశ్నపత్రాలు పోలిస్స్టేషన్‌లో భద్రపరిచామన్నారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా నిరంతరాయంగా తనిఖీలు ఉంటాయన్నారు. 11,457మంది పరీక్షలు రాస్తారన్నారు.

News March 12, 2026

మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

image

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.

News March 12, 2026

సంజూకు జట్టే ముఖ్యం.. సెంచరీలు కాదు: సూర్య

image

T20WCలో అదరగొట్టిన సంజూ శాంసన్‌పై కెప్టెన్ సూర్య ప్రశంసలు కురిపించారు. ‘చివరి 3 మ్యాచుల్లో ఆయన 97*, 89, 89 స్కోర్లు చేశారు. కావాలనుకుంటే వాటిని సెంచరీలుగా మలిచేవారు. కానీ 89 నుంచి 100కు చేరడానికి 10 బంతులను తీసుకుంటే నాన్ స్ట్రైకర్ నుంచి 6 బాల్స్‌ను లాగేసుకున్నట్లే. సంజూకు సెంచరీల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆయన అలా ఆడారు కాబట్టే దూబే 6 బంతుల్లో 28 రన్స్ కొట్టారు’ అని పేర్కొన్నారు.