News September 12, 2025
మహబూబ్‌నగర్: జాగ్రత్త.. భారీ వర్షాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుంది. MBNR, NGKL, వనపర్తి, కొడంగల్, జడ్చర్ల, కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News March 20, 2026
రూ.5.62 లక్షల కోట్లకు చేరువగా రుణభారం!

తెలంగాణలో అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై రుణభారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26లో రుణభారం రూ.5.03 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అదనంగా మరో రూ.59,000 కోట్లు పెరగనుంది. రుణభారం ఈ విధంగా పెరగడం వల్ల, ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు సేకరించే విషయంలో ప్రభుత్వానికి ఆటంకాలు తప్పేలా లేవు.
News March 20, 2026
ఆయిల్ పామ్ సాగుతో రైతు ఆదాయం రెట్టింపు: రాఘవరెడ్డి

ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. వరి, పత్తి, మిర్చి పొలాల్లో కూడా దీనిని సాగు చేయవచ్చని, రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించి మూడు రోజుల్లోనే నగదు జమ చేస్తుందని వెల్లడించారు. రైతు మహోత్సవంలో భాగంగా ఉత్తమ సాగుదారులుగా నిలిచిన రైతులను ఆయన సత్కరించారు. ఆధునిక సాగు పరికరాలపై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు.
News March 20, 2026
తిరుపతి: పెరిగిన పవర్ పెట్రోల్ రేట్లు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పవర్ పెట్రోల్ రేట్లు పెరిగాయి. రామచంద్రాపురం మండలంలో నిన్నటి వరకు లీటర్ పవర్ పెట్రోల్ రూ.117.75 ఉండగా ఇవాళ రూ.2.19 పెరిగి రూ.119.94కు చేరుకుంది. ప్రస్తుతానికి నార్మల్ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు.


