News September 12, 2025
శుభ సమయం (12-09-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ పంచమి మ.1.45 వరకు
✒ నక్షత్రం: భరణి సా.4.31 వరకు
✒ శుభ సమయములు: లేవు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: మ.3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: తె.3.43-ఉ.5.13
✒ అమృత ఘడియలు: మ.12.03-మ.1.32
Similar News
News September 12, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ ప.గో, ఏలూరు, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, NLR, KNL, నంద్యాల, ATP, కడప, TPT జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. అటు TGలో NML, NZB, HYD, మేడ్చల్, MBNR, NGKL, NRPT, వనపర్తి, మహబూబాబాద్, SRPT, JGL, SRCL, వికారాబాద్, కామారెడ్డి, గద్వాల్, NLG జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
News September 12, 2025
కాకినాడ మత్స్యకారులు విడుదల

AP: కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్ నావిగేషన్ తప్పుగా చూపించడంతో ఈ నలుగురు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ వీరిని అదుపులోకి తీసుకుంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ నలుగురిని విడుదల చేసింది. దీంతో జాలర్లు మరో 2 రోజుల్లో సముద్రమార్గం ద్వారా కాకినాడకు చేరుకోనున్నారు.
News September 12, 2025
తేజా సజ్జ ‘మిరాయ్’ పబ్లిక్ టాక్

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’లో తేజా సజ్జ, మంచు మనోజ్ నటనతో మెప్పించారని ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ SMలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కథా నేపథ్యం, విజువల్స్, BGM ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. కొన్ని సీన్లు గతంలో చూసిన మాదిరిగా అనిపిస్తాయని, క్లైమాక్స్ మెరుగ్గా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.